నారాయణఖేడ్ మండలం పోతన్ పల్లి(ఆర్) గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉప్పరి నాగన్న శనివారం మరణించిన విషయం మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి తెలుసుకొని వారి అంత్యక్రియలో పాల్గొని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యాన్ని చెప్పారు. వారితో పాటు తాజా మాజీ జడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నర్సింలు ముదిరాజ్, తదితరులు ఉన్నారు.