బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం ఉత్తరాశి పల్లి, ముట్పూరు గ్రామాలలో మండల సభ్యత్వ ప్రముఖ్ చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు కమ్మరి భూపాల చారి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదును చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సమర్థవంతమైన పరిపాలన సాగిస్తుందని అన్నారు.