తెలంగాణలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోందని సీఎం రేవంత్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలన్నారు. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేమని చెప్పారు. అందుకే కులగణన చేపట్టామని, ఇదొక మైలురాయిగా మిగులుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.