ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలు కోల్పోయేలా చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు వారి స్వార్థం కోసం అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ నగరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను ఖండించారు. అధికారులపై దాడి చేయిస్తే వెనక్కి తగ్గుతాం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.