సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల దగ్గరి నుంచి సామాన్యుల వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పాలనపై సంతృప్తిగా లేరన్నారు. నవంబరు 29 దీక్షా దివస్ విజయవంతం కోసం మంగళవారం శంషాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సబితారెడ్డి మాట్లాడారు.