ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుని బిల్లులు పొందాలని ఎంపీడీవో కుసుమ మాధురి సూచించారు. బుధవారం ఆమె మండలంలోని పోలేపల్లి గ్రామంలో మంజూరైన 20 ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వగా అందులో మూడు ఇండ్లు బేస్మెంట్ లెవెల్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి బిల్లులు పొందాలని చెప్పారు. అనంతరం నర్సరీని, ఉపాధి హామీ పనులను పరిశీలించారు.