యూకేలో యాక్సిడెంట్.. కోమాలోకి హైదరాబాద్ మహిళ
యూకేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గాయపడి కోమాలోకి వెళ్లింది. చైతన్యపురికి చెందిన వెంకట రమణమ్మ కూతురు హిమబిందు 5 నెలల క్రితం యూకేలోని ప్రెస్టన్ సిటీకి వెళ్లింది. అక్కడ ఓ హాస్పిటల్లో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. గత నెల 24న రోడ్డు దాటుతుండగా ఓ ట్రక్ ఆమెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. తన బిడ్డ వైద్యానికి ప్రభుత్వం సాయం చేయాలని వెంకటరమణమ్మ అభ్యర్థిస్తున్నారు.