పార్కుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. శనివారం ఆయన డివిజన్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్ 3లోని హెచ్ఎండీఏ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పార్కులలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కాలనీ వాసులు చర్యలు తీసుకోవాలని కోరారు.