కొడంగల్: 'మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి'
మహిళా సంఘాలు ఆర్థికంగా లబ్దిపొంది పేదరిక నిర్మూలనతో తమ పిల్లల విద్యాభివృద్ధితో ముందుకు సాగాలని కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి అన్నారు. కొడంగల్ మండల మహిళా సమాఖ్యలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. సమావేశంలో తహశీల్దార్ బీ. విజయ్ కుమార్, జిల్లా డిఆర్డి సరోజ, డీపీఎం వీరయ్య, ఏపీఎం వెంకన్న, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.