అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ సబ్సీడీసీ అమలు చేయాలని తాండూరు మున్సిపల్ గాంధీనగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీనగర్ లోని డ్వాక్రా భవన్ లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ కింద గ్యాస్ సిలిండర్ రూ. 500ల సబ్సీడీ లబ్దిదారులకు మున్సిపల్ ఆధ్వర్యంలో గుర్తింపు పత్రాల పంపిణీ నిర్వహించారు.