అలంకార ప్రాయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మారాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. వరి కోతలు ప్రారంభమై 20 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా సెంటర్లను ప్రారంభించిందే కాని ఒక్క గింజ కొనలేదని మంచిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీల లింకు పెట్టడంతో వారు ముందుకు రావడంలేదని, దీంతో కొనుగోలుపై అడుగు ముందుకు పడలేదన్నారు.