బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్నేహితుల ముసుగులో నలుగురు కలిసి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి పెళ్లి చేసుకుని నగరంలోనే ఉంటుంది. శుక్రవారం స్నేహితుడిని కలిసేందుకు హోటల్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న నలుగురు స్నేహితులు ఆమెను టెర్రస్‌పైకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా మరొకతను పరారీలో ఉన్నాడు.