నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు (వీడియో)

547பார்த்தது
ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఇద్దరు పోలీసులు పొట్టుపొట్టున కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. రోళ్ల పీఎస్‌కు చెందిన నారాయణ స్వామి నాయక్, ఆగళి పీఎస్‌కు చెందిన శివకుమార్ ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు. దాంతో మాటామాటా పెరిగి దారుణంగా కొట్టుకున్నారు.

தொடர்புடைய செய்தி