పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం శ్రావణమాసం గోపాష్టమి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు ఆరుట్ల హరీష్ చార్యులు భక్తులతో కలసి గోమాతలకు పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు ఆవులకి దాన, పండ్లు, ఆకుకూరలు, గడ్డి, బెల్లం, గోధుమలు, పిండి, తౌడు వంటి పదార్థాలను ఆహారంగా అందించి గోమాతల ఆశీర్వాదం తీసుకున్నారు.