రామగిరి: రైస్ మిల్ అనుమతి రద్దు చేయాలని వినతి
రామగిరి మండలం కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణవేణి పాఠశాల ఎదుట గృహాల సమూదాయంలో నిర్మిస్తున్న రైస్ మిల్ ను పనులు నిలిపి వేయాలని గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. ఇళ్ల మధ్య రైస్ మిల్ ఏర్పడితే దాని నుండి వచ్చే దుమ్ము ధూళితో అనారోగ్యాల పాలవుతామని, పాఠశాలలో చదివే విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బ తింటాయని, వెంటనే చర్యలు చేపట్టి తమ ప్రాణాలు కాపాడాలని అదనపు కలెక్టర్ కి విన్నవించారు.