నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్ ఆర్యవైశ్య సేవా సమితి కార్యాలయంలో ఆదివారం ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. గత కొన్ని రోజులుగా నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డ అభ్యర్థులు చివరి క్షణంలో రాకపోవడంతో అధ్యక్ష పదవి పద్మ శ్రీనివాస్ ను వరించింది. కార్యదర్శిగా అడ్డగుల్ల ప్రవీణ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా పద్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలిపించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ సమితి ద్వారా భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.