శివరాత్రికి ముస్తాబవుతున్న ప్రఖ్యాత ఆలయం

8984பார்த்தது
నందిపేట మండలం ఉమ్మేడ గ్రామ శివారులో ఆరు నెలలపాటు గోదావరిలో మునిగి ఉండే పురాతన ఉమా మహేశ్వరాలయం నీటి ప్రవాహం తగ్గడంతో ఆలయాన్ని గ్రామానికి చెందిన యువకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆదివారం శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న శివరాత్రి ఉత్సవాల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు తెలిపారు. ఉమామహేశ్వర ఆలయం లో శివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా జరుగుతాయి అని వారు అన్నారు. ఆలయం ముందున్న రాతి స్తంభం పైన గండ దీపాన్ని నిర్వాహకులు వెలిగిస్తారు అన్నారు. ఆ దీపం మూడు రోజులపాటు వెలగడం విశేషం. శివరాత్రి మరుసటి రోజు భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. శివరాత్రి ఉత్సవాలను తిలకించడం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, కరీంనగర్ ,ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలి వస్తారు అని వారు తెలిపారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி