రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతులను కాపాడాలని వారి సంక్షేమం కోసం కృషి చేయాలని తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షుడు ప్రేమ్ లాల్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సంచార జాతుల వారి పిల్లలకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని వారి సంక్షేమం కోసం కొత్త పథకాలు అమలుకు కృషి చేయాలని కోరారు. బాలకృష్ణ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని సూచించారు.