నిజామాబాద్ జిల్లాలో బీసీ కమీషన్ నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో ప్రతి బీసీ కుల సంఘ నాయకులు పాల్గొని తమ డిమాండ్లను తెలియజేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను పొడిగించే ఉద్దేశ్యంతో బీసీ కమీషనన్ను ఏర్పాటుచేయడం హర్షనీయమన్నారు.