వినియోగదారులకు కల్తీ, కాలం చెల్లిన వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని హోటల్ మయూరిలో పలు హోటళ్లు, కిరాణా షాపులు, బేకరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. కల్తీ, కాలం చెల్లిన వస్తువులను విక్రయించవద్దని సూచించారు. నాణ్యాతా నిబంధనలు పాటించకుండా వినియోగదారులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.