విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలని బాసర మండల విద్యాధికారి జి. మైసాజి అన్నారు. బాసర మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో యూఎస్ఏ పౌరుల ఆర్థిక సాయంతో నిర్వహించబడుతున్న రూమ్ టు రీడ్ ఇండియా స్పాన్సర్షిప్ ద్వారా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యoలో జిల్లాలోని అన్ని మండలాల్లో మోడల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేశారన్నారు.