బాసర గోదావరిలో అప్పుల బాధ తాళలేక నిజామాబాద్ కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో భార్య, భర్త, కూతురు నదిలో దూకగా భార్య అనూరాధను స్థానికులు కాపాడి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాధితురాలు అనురాధను భైంసా ఆసుపత్రిలో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భర్త వేణు మృతదేహం లభ్యం, కుతురు పౌర్ణమి మృతదేహం కోసం గాలిస్తున్నారని తెలిపారు.