ఆర్జీయూకేటీ బాసరలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉండాలని, రాజ్యాంగంలో పొందుపరచబడిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం సూత్రాలను గౌరవించాలని పేర్కొన్నారు. మన రాజ్యాంగం శాశ్వతమైన విలువలను, మార్గదర్శక సూత్రాలుగా కొనసాగిస్తుందని తెలిపారు.