సుదీర్ఘ పోరాటంతోనే వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం జన్నారం పట్టణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. 30 సంవత్సరాలు అలుపెరగని ఉద్యమాలు చేశామని, కొందరు స్వార్థపరులు వర్గీకరణకు అడ్డు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.