సూర్యాపేట: ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ల్యాండ్ సర్వే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డిని విధుల నుండి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోదాడ మండలం శ్రీరంగాపురానికి చెందిన రైతు దొంగరి వెంకటేశ్వర్లు నుండి పదివేల లంచం తీసుకున్నట్లు రైతు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.