రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ ను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు ఇచ్చే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్( సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండలోని విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేసి ఎంఈఓ అరుంధతికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.