నల్గొండ జిల్లాలో ప్రతి కుటుంబానికి వందరోజుల పని కల్పించడమే లక్ష్యంగా అధికారులు ఉపాధి ప్రాణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 64 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పనుల గుర్తింపునకు శ్రీకారం చుట్టిన అధికారులు. ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. నవంబర్ మాసం చివరి నాటికి పనుల లక్ష్యాన్ని నిర్ధారించనున్నారు. జిల్లాలో 3, 58, 571 జాబ్ కార్డులు ఉన్నాయి.