తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. నల్లగొండలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కిషోర్, కంచర్ల హాజరయ్యారు.