కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొంపెల్లి మాజీ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్ , రైతు ఉత్పత్తి దారుల సంఘం చైర్మన్ మక్కెన అప్పారావు కోరారు. మంగళవారం ఆ గ్రామంలోని శివాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.