
మాడుగులపల్లి: గ్రామ పోలీసు అధికారుల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం
గ్రామ పోలీసు అధికారులు ద్వారా జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కలుగుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మంగళవారం అన్నారు. మాడుగుల పల్లి మండల పరిధిలోని ఆగమోత్కూర్ గ్రామానికి సందర్శించి మాట్లాడుతూ విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు మెరుగైన సేవలు వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సoబంధాలు ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు.