మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 1 నుండి 5వ తరగతి విద్యార్థుల స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. చిన్నారులు బుడిబుడి అడుగులతో ప్రత్యేక అలంకరణలతో ఉపాధ్యాయులుగా, మండలాధికారిగా, ఎమ్మెల్యేగా పాఠశాలలో స్వపరిపాలన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు రాణి, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.