రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టక రమని బీసీ సంక్షేమ సంఘం దేవరకొండ నియోజకవర్గం నాయకులు చింతపల్లి సతీష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ కు పగటి కలలు వస్తాయని అందుకే అర్థంపర్థంలేని అనాలోచితమైన టువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. వెంటనే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఉపసంహ రించుకోవాలని మండిపడ్డారు.
భారత రాజ్యాంగం గురించి ప్రపంచంలోని గొప్పగా చెప్పుకు టారని ఆయన అన్నారు. అసమానతలతో కూడిన దేశంలో సమానతలను తీసుకువచ్చేందుకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన తెలిపారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడటం వల్ల పరిపాలన సులభం అవుతుందని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్న విషయం ముఖ్యమంత్రి మరిచిపోయారని ఆయన పేర్కొన్నారు. అరవై దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత దేశ పరిస్థి తులకు అనుగుణంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొంది ంచారని అన్నారు. రెండేళ్లకు పైగా శ్రమించి రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సత్య నారి తిరుపతి వెంకటేష్ తదితరులు ఉన్నారు.