తెలంగాణలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు యేడాది పూర్తయిన సందర్భంగా మరియు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేసి విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో విరాజిల్లాలని శ్రీవారిని ఎమ్మెల్యే వేడుకున్నారు.