మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నర్సాపూర్ ఎలాంటి అభివృద్ధి చెందలేదని, నేడు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే విద్య, వైద్యం, వ్యవసాయం కుంటుపడ్డాయన్నారు.