హైదరాబాద్ నగరంలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడానికి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గురువారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.