మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం సికింద్లపూర్ దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఈఓ శశిధర్ విజ్ఞప్తి చేశారు. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం కొండపై ధ్వజ స్తంభం నుండి మొదటి పార్కింగ్ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కార్యనిర్వహణాధికారి సొంత నిధులతో రూ.50వేలు అందజేశారు. కాగా 50 టన్నుల కంకర, 50 టన్నులు డస్ట్, 250 సిమెంటు బస్తాలకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.