నారాయణఖేడ్: హెల్త్ క్యాంపును పరిశీలించిన జిల్లా వైద్యాధికారి
కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట గ్రామంలోని హెల్త్ క్యాంపు ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి ఆదివారం పరిశీలించారు. స్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆమె వెంట డిప్యూటీ ఉప వైద్యాధికారి డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సంగారెడ్డి ఉన్నారు.