మందమర్రి మండలంలోని క్యాతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని శుక్రవారం ఉదయం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్, సంబంధిత అధికారులతో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన స్థితిగతులను అడిగి తెలుసుకొని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జీఎంకు ఫోన్ చేసి బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన ఫ్లైయాష్ సరఫరా చేయాలని సూచించారు.