మంచిర్యాల జిల్లాలోని ఎంఈఓ ల కు హైదరాబాద్ లో మంగళవారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని డిఇఓ యాదయ్య తెలిపారు. పాఠశాలల బలోపేతం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.. వారికి విధులపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ శిక్షణకు హాజరుకావాలని ఎంఈఓ లకు విద్యాశాఖ సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. జిల్లా నుంచి 18 మంది ఎంఈఓ లు శిక్షణకు హాజరవుతారని డిఇఓ వివరించారు.