కోటపల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకులు మంత్రి సురేఖ, ఉడుత అశ్విత పలువురు మహిళలకు బీజేపీ సభ్యత్వం కల్పించి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య, ఉపాధ్యక్షులు పెద్దింటి పున్నం చందు, తదితరులు పాల్గొన్నారు.