ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందించాలని మంచిర్యాల డీఎంహెచ్ఓ హరీష్ రాజ్ అన్నారు. దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ ఉప కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆయుష్మాన్ ఉప కేంద్రాల్లో టీకాల కార్యక్రమంలో రోజు సమయపాలన పాటించాలన్నారు.