రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను శుక్రవార చెన్నూర్ మండలంలోని అక్కేపల్లి, శివలింగపూర్ గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర్ రావు ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి ఎన్యుమరేటర్లు చేస్తున్న సర్వేను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం. మోహన్, ఎంపీఓ ఎండీ అజ్మత్ అలీ, పంచాయతీ కార్యదర్శి ఎండీ సిరాజోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.