జైపూర్ మండలంలో అక్రమంగా ప్రభుత్వ భూముల నుంచి రాత్రి సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. జెసిబి ఓనర్ పున్నంతో పాటు ట్రాక్టర్ యజమాని బొల్లం శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి రెండు ట్రాక్టర్లతో పాటు జెసిబిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.