రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోచంపల్లి హరీష్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి లో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు భర్తీ కాకపోవడంతో నిరుద్యోగులు ఆవేదన చెందుతూ ఆత్మహత్యలు చేసుకున్నారని దానికి ఉదాహరణ కోటపల్లి మండలం మహేష్ ఆత్మహత్య అని ఆయన అన్నారు. మహేష్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, మహేష్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు.