బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడాన్ని నివసిస్తూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు, రైతులు హాజరు కావాలని కోరారు.