మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని నార్వయి పేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మౌనిక గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మౌనిక పరిస్థితి తెలుసుకున్న మండల నాయకులు వెంటనే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకువెళ్ళగా.. బుధవారం వెంటనే స్పందించి రూ. 3 లక్షల ఎల్ఓసీని వారి కుటుంబ సభ్యులకు అందించారు.