నెన్నెల మండల కమిటీ ఆధ్వర్యంలో మండల సహయ కార్యదర్శి గంట అనిల్ కుమార్ శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ గత రెండు రోజులుగా కుండ పోతగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట నేలమట్టం అయిందని, రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని, వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఆదుకోవాలని కోరారు.