మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ సహకారంతో మధుమేహం పై గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశ్వేశ్వర రావు మధుమేహం అంటే మీ రక్తములో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటమని, అధికంగా దాహం వేయడం, తరచుగా మూత్రం విసర్జన రావడం, అలసట దృష్ట్యా సమస్యలు, పొడి బారిన చర్మం లేదా చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడతాయని అన్నారు.