విద్యార్థి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎన్‌ఎస్‌యూఐ

284பார்த்தது
విద్యార్థి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: ఎన్‌ఎస్‌యూఐ
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు ఆదేశాల మేరకు బెల్లంపల్లిలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు బంద్ ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పరీక్షలకు హాజరైన విద్యార్థులను పాస్ చేయాలని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థుల మరణాలకు కారణమైన అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షులు గ్లడ్సాన్, కాంపెళ్లి పవన్, బెల్లంపల్లి మండల అధ్యక్షుడు ముద్దం శివ ప్రసాద్, ఉపాధ్యక్షులు సాయి కుమార్, తదితర నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி