తీర్యాణి మండలములో గత 7 సంవత్సరాలనుంచీ ఉపాధి హామీ పథకంలో టీఏ గా పని చేస్తున్న బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ రడగంబాల బస్తీకి చెందిన గంధం చిన్ని సంపత్ బుధవారం రోజు ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి రాగా అప్పటికే ఎండలో తిరగడంతో మోషన్, వామ్టింగ్ రావడంతో హుటాహుటిన రాత్రి మంచేరియల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా వడదెబ్బ తగిలి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
చిన్ని సంపత్ చనిపోయిన విషయం తెలియడంతో కొమురం భీమ్ జిల్లా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్ మరియు అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కుటుంబరావు చిన్ని సంపత్ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంపత్ కుటుంబ సభ్యులకు పరామర్శిస్తూ గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి తాము సంపత్ కుటుంబానికి అండగా ఉంటామని, వీలైనంత వరకు సహాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. కాగా సంపత్ కు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, తన భార్యకు ఉపాధి కల్పించాలని కోరగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. వారితో పాటు తిర్యాణి ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.